ఆఫీస్ తాజ్ మహల్ అయితే ..

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ భవనంలో కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తే ఆ థ్రిల్లే వేరుంటుంది కదూ.. అలాంటి థ్రిల్ నే అందించేందుకు మైక్రోసాఫ్ట్ ఓ కొత్త ఐడియా డిజైన్ చేసింది. రీసెంట్‌గా నోయిడాలో నిర్మించిన మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌ను డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశారు సత్య నాదెళ్ల. నోయిడా ఆఫీస్.. హైదరాబాద్, బెంగళూరు ఆఫీసులకంటే డిఫరెంట్ గా ఉండాలని భావించి.. దాన్ని తాజ్ మహల్ నిర్మాణాన్ని పోలి ఉండేలా నిర్మించారు. పని చేసే చోట వాతావరణం, సౌకర్యాలు బాగుంటేనే ఉద్యోగుల పనితీరు బాగుంటుందని ఇలా డిజైన్ చేశామని చెప్తున్నారు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల. “ప్రపంచంలో తాజ్ మహల్ ను మించిన అద్భుతం మరొకటి ఉంటుంది. అంత అద్భుతమైన కట్టడంలో కూర్చొని పనిచేస్తున్నట్టు ఉద్యోగుల్లో పాజిటివ్ ఫీలింగ్ కలిగితే ఉద్యోగుల పనితీరు కూడా బాగుంటుందని ఇలా ప్లాన్ చేశాం” అని మైక్రోసాఫ్ట్ నోయిడా సెంటర్ టీం అన్నారు.

తాజ్ మహల్‌కు ఓ వైపున యమునా నది, మరో వైపు చార్ భాగ్ గార్డెన్ ఎలా ఉంటుందో.. నోయిడాలోని మైక్రోసాఫ్ట్ ఆఫీసులో కూడా ఆర్టిఫీషియల్ గా అచ్చం అలాగే ఉండేట్టు ప్లాన్ చేశారు. ఇంటీరియర్ లో కూడా చాలా కేర్ తీసుకున్నారు. అచ్చు గుద్దినట్టు తాజ్ మహల్ ఇంటీరియర్‌ను రెప్లికేట్ చేసేలా డిజైన్ చేశారు.