పవర్ ప్లే మార్చి 5 నుంచి..!

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. వ‌న‌మాలి క్రియేష‌న్స్ బ్యానర్ పై మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న గ్రాండ్‌గా విడుద‌ల‌చేయ‌నున్నారు.

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ – ` `ఒరేయ్ బుజ్జిగా..`లాంటి మంచి ఎంట‌ర్‌టైన‌ర్ త‌ర్వాత మా టీమ్ అంతా క‌లిసి స‌రికొత్త జోన‌ర్‌లో చేస్తోన్న డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ ఇది. విజ‌య్‌గారు,  నంద్యాల ర‌విగారు, మ‌ధునంద‌న్ క‌లిసి అద్భుత‌‌మైన‌ స్క్రిప్ట్ రెడీ చేశారు. హేమ‌ల్ అమేజింగ్ కో-స్టార్‌. త‌న‌కి ఈ సినిమా మంచి పేరు తేవాల‌ని ఆశిస్తున్నారు. పూర్ణ‌గారు ఫ‌స్ట్‌టైమ్ ఒక‌ ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో కనిపిస్తారు. సురేష్ బొబ్బిలి మంచి సంగీతంలో పాటు అదిరిపోయే ఆర్ ఆర్ ఇచ్చారు.”

ఈ సినిమా తర్వాత విజయ్ కుమార్ కొండాతో కలిసి మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించాడు హీరో రాజ్ తరుణ్. ప‌వ‌ర్‌ప్లే సినిమా మార్చి 5న విడుద‌ల కాబోతుంది.