పుష్ప మేటర్ బయటపెట్టిన దేవిశ్రీ

దేవిశ్రీప్రసాద్, సుకుమార్ కలిశారంటే కచ్చితంగా ఆ సినిమాలో ఐటెంసాంగ్ ఉండాల్సిందే. వీళ్లకు బన్నీ కూడా తోడయ్యాడంటే ఆ సాంగ్ సూపర్ హిట్టవ్వాల్సిందే. పుష్ప సినిమాతో ఇది మరోసారి రిపీట్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో ఐటెం ఉందని కొందరు, లేదని కొందరు వాదిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ మేటర్ పై దేవిశ్రీప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు

“పుష్పలో ఐటెంసాంగ్ ఉంది. ఆల్రెడీ రికార్డింగ్ కూడా పూర్తయింది. కచ్చితంగా మరో బెస్ట్ సింగిల్ అవుతుంది. అటు బన్నీ, ఇటు సుక్కూ ఉంటే పాట హిట్టవ్వాల్సిందే కదా. లొకేషన్ లో నిర్మాత దిల్ రాజు కూడా ఈ సాంగ్ విన్నారు. ఆయనకు కూడా బాగా నచ్చింది. సాంగ్ బాగుందని నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు.”

ఇలా పుష్పలో ఐటెంసాంగ్ ఉందనే విషయాన్ని బయటపెట్టాడు దేవిశ్రీప్రసాద్. ఉప్పెన సినిమా ప్రచారం కోసం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈ మ్యూజిక్ డైరక్టర్ కు ఆ సినిమా కంటే, పుష్ప సినిమాకు సంబంధించే ఎక్కువ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందులో భాగంగా ఐటెంసాంగ్ పై క్లారిటీ ఇచ్చాడు దేవిశ్రీ.