జాంబీ రెడ్డి ఫస్ట్ డే వసూళ్లు

జాంబీ రెడ్డిలో చెప్పుకోదగ్గ హీరో లేడు. స్టార్ హీరోయిన్లు, ఫేమస్ డైరక్టర్ కూడా లేడు. కానీ ఈ సినిమా
ట్రయిలర్ తో ఆకట్టుకుంది. అందుకే మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నిన్న రిలీజైన ఈ సినిమాకు
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 26 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి.

తేజ లాంటి కొత్త హీరో సినిమాకు ఈ రేంజ్ లో వసూళ్లు రావడం నిజంగా గ్రేట్. అది కూడా 50శాతం
ఆక్యుపెన్సీతో ఈ వసూళ్లంటే గొప్ప విషయమే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కోటి రూపాయలకు పైగా
షేర్ వచ్చింది. ఏపీ, నైజాంలో జాంబీరెడ్డి మొదటి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 31 లక్షలు
సీడెడ్ – 20 లక్షలు
ఉత్తరాంధ్ర – 11.5 లక్షలు
ఈస్ట్ – 9 లక్షలు
వెస్ట్ – 8 లక్షలు
గుంటూరు – 9.2 లక్షలు
కృష్ణా – 8.3 లక్షలు
నెల్లూరు – 6 లక్షలు