ఆయన పక్కా కమర్షియల్

లాంగ్ గ్యాప్ తర్వాత మారుతి ఓ కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీకి సంబంధించి
హీరో, టైటిల్, కథ, ప్రొడక్షన్.. ఇలా ఏదీ లేకపోయినా ముందుగా రిలీజ్ డేట్ ప్రకటించారు. తమ సినిమా
అక్టోబర్ 1న థియేటర్లలోకి రాబోతోందంటూ కుర్చీపై కర్చీఫ్ వేసే స్టిల్ రిలీజ్ చేశారు.

ఇప్పుడు తాపీగా సినిమాకు సంబంధించి ఒక్కో మేటర్ రిలీజ్ చేస్తున్నారు. గోపీచంద్ హీరోగా మారుతి
దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్-2 బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాకు
‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ అనుకుంటున్నారు.

సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో అతడు పూర్తిగా డబ్బు మనిషి
క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అందుకే పక్కా కమర్షియల్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
మూవీలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.