మాల్దీవుల్లో ల్యాండ్ అయిన కింగ్

హీరో నాగార్జున ఇప్పుడెక్కడ? గతేడాది నుంచి ఇనస్టాగ్రామ్ వాడడం మానేశాడు. దాదాపు నెల రోజులుగా ట్విట్టర్ లో కనిపించడం లేదు. మూవీ అప్ డేట్స్ లేవు, బయట ఫంక్షన్లు లేవు. ఇలా అజ్ఞాతంలో గడుపుతున్న నాగార్జున నుంచి ఎట్టకేలకు ఓ అప్ డేట్ వచ్చింది. ఆయన ఎక్కడున్నారో తెలిసింది.

రీసెంట్ గా మాల్దీవులు వెళ్లారు నాగార్జున. ఆ విషయాన్ని కూడా నాగ్ బయటపెట్టలేదు. అమల ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెట్టారు. మాల్దీవుల్లో నాగ్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న కొన్ని స్టిల్స్ ను పోస్ట్ చేశారామె.

నాగ్ నటించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్. ఆ సినిమా షూటింగ్ పూర్తయి చాన్నాళ్లయింది. ఫస్ట్ కాపీ కూడా రెడీగా ఉంది. కానీ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఈలోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని కొందరు, ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని మరికొందరు చెబుతున్నారు. దానిపై కూడా క్లారిటీ లేదు.