హీరోయిన్ ఎకౌంట్ హ్యాక్

హీరోయిన్ నందిత శ్వేత ఎకౌంట్ హ్యాక్ అయింది. ఆమెకు చెందిన ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ ను గుర్తుతెలియని
వ్యక్తులు హ్యాక్ చేశారు. దీంతో తన ఎకౌంట్ పై ఆమె పట్టు కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా
ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

తన ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాక్ అయిందనే విషయాన్ని బయటపెట్టింది నందిత శ్వేత. తన ఎకౌంట్
నుంచి ఏవైనా అవాంఛిత పోస్టులు వస్తే, వాటికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది.

గతంలో స్మిత, సునీత్, రాశిఖన్నా, సమంత, అమలాపాల్, పూజా హెగ్డే లాంటి తారల ఎకౌంట్లు హ్యాక్
అయ్యాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి నందిత శ్వేత కూడా చేరిపోయింది. ఆమె నటించిన కపటధారి సినిమా
ఈనెల 26న థియేటర్లలోకి రాబోతోంది.