పవన్ కు ఆ సెంటిమెంట్ పనిచేస్తుందా?

పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా సూపర్ హిట్ అంటున్నారు ఫ్యాన్స్. దీనికి వాళ్ల దగ్గర ఓ తిరుగులేని సెంటిమెంట్ ఉంది. అదే కీరవాణి సంగీతం. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం  అందిస్తున్నాడు కాబట్టి పవన్-క్రిష్ సినిమా సూపర్ హిట్ అంటున్నారు. దీని వెనక లాజిక్ ఏంటో చూద్దాం.

కీరవాణి తన కెరీర్ లో తొలిసారి చిరంజీవికి ఘరానా మొగుడు సినిమాకు సంగీతం అందించాడు. అది బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇక ఇదే కీరవాణి తన కెరీర్ లో తొలిసారి రామ్ చరణ్ సినిమా మగధీరకు సంగీతం అందించాడు. అది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇప్పుడు కీరవాణి, తన కెరీర్ లో తొలిసారి పవన్ కల్యాణ్ కు సంగీతం అందిస్తున్నాడు. అదే క్రిష్ సినిమా. సో.. సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే, పవన్ కల్యాణ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్.

లాజిక్ అయితే బాగుంది కానీ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనేది చూడాలి. అన్నట్టు ఈ సినిమా కోసం 17వ శతాబ్దంనాటి చార్మినాట్ సెట్ ను వేస్తున్నారు. త్వరలోనే ఆ సెట్ లో షూటింగ్ స్టార్ట్
అవుతుంది.