బన్నీ మేకప్ కు 2 గంటలు

rashmika mandanna movies list

పుష్ప సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్ డేట్ బయటకొచ్చింది. ఈసారి సినిమాలో కాస్ట్యూమ్స్, మేకప్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. పుష్ప సినిమాలో మేకప్స్ అందర్నీ ఎట్రాక్ట్
చేస్తాయని చెబుతోంది హీరోయిన్ రష్మిక. మరీ ముఖ్యంగా బన్నీ లుక్, గెటప్ అందర్నీ ఎంతగానే ఆకర్షిస్తోంది చెబుతోంది.

రష్మిక చెప్పిన ప్రకారం.. పుష్ప సినిమా కోసం బన్నీకి మేకప్ వేయడానికి 2 గంటల టైమ్ పడుతోందట. అది మళ్లీ తీయడానికి మరో గంట సమయం పడుతోందట. ఈ సినిమా కోసం బన్నీ
ఉదయాన్నే 8 గంటలకల్లా మేకప్ తో సెట్లో రెడీగా ఉంటున్నాడట. అంటే ఉదయం 6 గంటల నుంచే మేకప్ స్టార్ట్ అన్నమాట. ఇక ఆ మేకప్ తో సాయంత్రం 7 గంటల వరకు ఉంటున్నాడట అల్లు
అర్జున్.

అలా ఉదయం నుంచి రాత్రి వరకు ఏకథాటిగా షూటింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది రష్మిక. ఈ సినిమాలో పల్లెటూరి పిల్లగా కనిపించబోతోంది రష్మిక. చిత్తూరు యాసలో కూడా మాట్లాడబోతోంది.
దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.