మహేష్ కోసం రాజమౌళి సెటప్

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమా తర్వాత ఆయన మహేష్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఓవైపు ఆర్ఆర్ఆర్ వర్క్ నడుస్తుండగానే, మరోవైపు మహేష్ సినిమాకు సంబంధించిన పనులు స్టార్ట్ చేశాడు జక్కన్న. దీనికి సంబంధించి ఓ టీమ్ ను ప్రత్యేకంగా నియమించాడు.

మహేష్ బాబు సినిమాకు సంబంధించి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే 5 స్టోరీలైన్స్ ఫిక్స్ చేశారు. వీటిలో 2 స్టోరీలైన్స్ ను రాజమౌళి ఫైనల్ చేశాడు. ఆ రెండు స్టోరీ లైన్స్ పై కొంతమంది రచయితల బృందం పనిచేస్తోంది. ఆ డెవలప్ మెంట్స్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాడు రాజమౌళి.

ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలోకి వచ్చేలోపు మహేష్ మూవీకి సంబంధించిన కథను ఫిక్స్ చేయాలనేది రాజమౌళి టార్గెట్. అందుకే కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఓవైపు ఆర్ఆర్ఆర్ పూర్తిచేస్తూనే, మరోవైపు మహేష్ కథపై కూర్చుంటున్నాడు. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ థియేటర్లలోకి రానుంది. ఆ వెంటనే మహేష్-రాజమౌళి సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.