గర్జించడానికి రెడీ అయిన లక్ష్మీరాయ్

మనిషి, జంతువు… వీరిలో ఎవరు ఎక్కువ ప్రమాదకరం? ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే
జంతువు దాడి చేస్తుంది… మనిషి దాడి చేయడానికి కారణం అవసరం లేదు. ఈ అంశం ఆధారంగా
తెరకెక్కిన చిత్రమే ‘గర్జన’.

శ్రీరామ్, లక్ష్మీరాయ్ జంటగా జాగ్వార్ స్టూడియోస్ పతాకంపై బి. వినోద్ జైన్ సమర్పణలో ఎం. నరేష్ జైన్
ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా విఎఫ్ఎక్స్ తో రూపొందిన పులి ఈ చిత్రం
ద్వారా ఎక్కువసేపు వెండితెరమీద కనిపించనుంది. ఇండియాలో ఓ సినిమాలో పులి ఇంత ఎక్కువసేపు
తెరపై కనిపించడం గర్జనలోనే తొలిసారి.

ఓ చిన్నారి, ఓ యువతి, పులి మధ్య సాగే ఈ పులి వేట ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. టామ్ అండ్
జెర్రీ కథ మాదిరిగా సాగే ఈ వేట చివరికి ఎలా ముగుస్తుందో తెర మీద చూడాల్సిందే. కథ, స్క్రీన్ప్ ప్లే,
సినిమాట్రోగ్రఫీ ఎంవీ పన్నీర్ సెల్వమ్ నిర్వర్తించారు. విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన పెద్దపులి ఈ
చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత నరేష్ జైన్ తెలిపారు. మార్చి 5న గర్జన థియేటర్లలోకి
రానుంది.