ఇదే సక్సెస్ అంటున్న అల్లరోడు

దాదాపు 8 ఏళ్ల తర్వాత తనకు సక్సెస్ వచ్చిందంటున్నాడు హీరో అల్లరి నరేష్. అప్పుడెప్పుడో సుడిగాడు సినిమాతో సక్సెస్ వచ్చిందని, మళ్లీ ఇన్నేళ్లకు నాంది సినిమాతో సక్సెస్ పడిందని చెబుతున్నాడు. సినిమా గురించి, సినిమాలో ఓ షాట్ గురించి అల్లరి నరేష్ ప్రత్యేకంగా వివరించాడు.

→ “2012 తర్వాత హిట్స్ పలకరించడం మానేశాయి. ఈసారి మనదే అని ప్రతీసారి అనుకుంటున్నాను. కానీ 2021 మాత్రం ఈసారి మనదే అయ్యింది. మహర్షి తర్వాత కంగారు పడి సినిమా చేయకూడదు కంటెంట్ తో చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. విజయ్ వచ్చి కథ చెప్పినప్పుడు పోలీస్, లాయర్ ల గురించి అన్ని విషయాలు రీసెర్చ్ చేసి చేయాలని అతనికి చెప్పాను.”

→ “ఆరు నిమిషాల ఒక షాట్ ఉంటుంది, నేను వరలక్ష్మి, ప్రియదర్శి ఆ సీన్ లో చేయాలి. అంత సేపు ఎమోషన్ క్యారీ చేయాలి. చేయగలమా అనుకున్నాం. కానీ సీన్ చేశాక సంతృప్తిగా అనిపించింది. ఇకపై ఈ విజయాన్ని కొనసాగించేలా సినిమాలు ఎంచుకుంటున్నాను.”