ఎట్టకేలకు మరో ఛాన్స్ పట్టాడు

హీరోలకు ఫ్లాపులొచ్చినా అవకాశాలొస్తాయి. ఫ్లాపుల్లో కొనసాగుతూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్న
హీరోలు మన దగ్గర చాలామంది ఉన్నారు. కానీ దర్శకుడి పరిస్థితి మాత్రం దారణం. ఒక ఫ్లాప్ వచ్చిందంటే చాలు ఇక అతడి పనైపోయినట్టే. దర్శకుడు సుజీత్ ది దాదాపు ఇదే పరిస్థితి.

సాహో దెబ్బతో విలవిల్లాడిన ఈ దర్శకుడు.. లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఊహించని విధంగా
లూసిఫర్ రీమేక్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఆ అవకాశం కూడా
చేజారింది. దీంతో మరింత డీలా పడిపోయాడు. ఎట్టకేలకు ఈ దర్శకుడు మరో సినిమా అవకాశం
అందుకున్నాడు.

జీ స్టుడియోస్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు సుజీత్. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెలుగు-హిందీ
భాషల్లో ఈ సినిమాను ఒకేసారి తెరకెక్కించబోతున్నారు. సేమ్ టైమ్ మలయాళం, తమిళ, కన్నడ భాషల్లోకి
డబ్ చేసి రిలీజ్ చేస్తారు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ఇందులో హీరోగా నటించే ఛాన్స్ ఉంది.

అయితే ఈ సినిమాను జీ స్టుడియోస్ సంస్థ రిలీజ్ చేస్తుందా లేక నేరుగా తన ఓటీటీ లో విడుదల
చేస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సంగతి పక్కనపెడితే.. సుజీత్ కు ఎట్టకేలకు మరో ఛాన్స్
రావడం ఆనందించదగ్గ విషయం.