నైజాంలో ”నాంది” పడింది

ఊహించని విధంగా హిట్ టాక్ తెచ్చుకుంది నాంది సినిమా. సీరియస్ పాత్రలో అల్లరి నరేష్ నటించిన ఈ
సినిమా అతడికి 8 ఏళ్ల తర్వాత సక్సెస్ తెచ్చిపెట్టింది. ఇప్పుడీ సినిమా నిర్మాతకు డబ్బులు కూడా
తెచ్చిపెడుతోంది. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన నాంది సినిమా నైజాంలో బ్రేక్ ఈవెన్ అయింది.
నిన్నట్నుంచి లాభాల బాట పట్టింది.

నైజాంలో అతి తక్కువ రేటుకు అమ్మారు నాంది సినిమాని. దీంతో 2 కోట్ల రూపాయల గ్రాస్ కే బ్రేక్ ఈవెన్
సాధించింది ఈ సినిమా. మూవీకి హిట్ టాక్ రావడంతో నిన్నట్నుంచి ప్రతి థియేటర్ నుంచి ఈ సినిమాకు
ప్రాఫిట్స్ వస్తున్నాయి.

ఇటు ఆంధ్రలో మాత్రం పరిస్థితి అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. సినిమా బాగుందని అంతా
అంటున్నారు కానీ ఎవ్వరూ థియేటర్లకు రావడం లేదు. అయితే బ్రేక్ ఈవెన్ కు మాత్రం దగ్గరైంది. ఈరోజు
ఆంధ్రాలోని మెయిన్ సెంటర్లలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది. చూస్తుంటే.. ఈ వారాంతానికి
ఆంధ్ర, సీడెడ్ లో కూడా ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ప్రవేశిస్తుంది.