మళ్లీ హీరోగా సునీల్

హీరోగా రాణించేందుకు విశ్వప్రయత్నం చేశాడు సునీల్. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇక ఫేడవుట్
అయిపోతున్నాడనుకునే టైమ్ కు మళ్లీ కామెడీ పాత్రల వైపు షిఫ్ట్ అయ్యాడు. అయితే ఈసారి కామెడీ
పరంగా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు ఈ నటుడు. ఈ క్రమంలో 2 పడవల ప్రయాణం స్టార్ట్
చేశాడు సునీల్.

ఓవైపు కమెడియన్ గా నటిస్తూనే, మరోవైపు హీరో పాత్రలు కూడా పోషించాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో
భాగంగా ఇప్పటికే మర్యాద కృష్ణయ్య అనే సినిమా పూర్తిచేసిన సునీల్.. ఇప్పుడు హీరోగా మరో సినిమా
మొదలుపెట్టబోతున్నాడు.

ఈ సినిమా పేరు డీటీఎస్. అంటే… డేర్ టు స్లీప్ అని అర్థం. ఇలాంటి డిఫరెంట్ టైటిల్ తో సునీల్ సినిమా
రాబోతోంది. ఇక్కడో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి
తెరకెక్కించబోతున్నారు. 2 నెలల పాటు ఏకథాటిగా షూటింగ్ చేసి ఈ సినిమాను పూర్తిచేయాలని ఫిక్స్
అయ్యారు. ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమౌతుంది. రెగ్యులర్ షూటింగ్ ను కూడా ఇవాళ్టి
నుంచి ప్రారంభించబోతున్నారు.