మరే హీరోయిన్ కు దక్కని ఘనత

లాక్ డౌన్ తర్వాత ఏ హీరోయిన్ సాధించని ఘనత సాధించింది హీరోయిన్ నందిత శ్వేత. రీసెంట్ గానే థియేటర్లు తెరుచుకున్నాయి. అయినప్పటికీ అన్ని భాషల్లో కలుపుకొని నందిత శ్వేత నటించిన సినిమాలు ఏకబిగిన 4 రిలీజ్ అయ్యాయి.

“నా సినిమాల్లో ఇటీవల కపటధారి థియేటర్లో రిలీజ్ అయ్యింది. మార్చి నుంచి చూస్తే అక్షరతో కలిపి నేను చేసిన నాలుగు సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. ఇది మరే హీరోయిన్ కు దక్కని ఘనత అనుకోవచ్చు.”

ఇలా ఏ హీరోయిన్ కు దక్కని ఘనత సాధించింది నందిత శ్వేత. ఆమె నటించిన అక్షర సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. కార్పొరేట్ విద్యా వ్యవస్థ దోపిడీ, లొసుగులపై ఈ సినిమాను సందేశాత్మకంగా తెరకెక్కించారు.