ఆచార్య మూవీ అప్ డేట్స్

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో
రామ్ చరణ్ ఓ కీలకమైన పెద్ద పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. వచ్చేనెల 6వ తేదీ వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది.
చిరంజీవి-చరణ్ మధ్య వచ్చే కీలక సన్నివేశాల్ని అక్కడ తీస్తున్నారు.

మార్చి 6తో షెడ్యూల్ పూర్తిచేసి, ఆ వెంటనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభించాలనే ఆలోచనలో
ఉంది ఆచార్య యూనిట్. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఆల్రెడీ లాక్ అయింది. మే 13న ఈ
సినిమాను రిలీజ్ చేయాలంటే ఇక రెస్ట్ తీసుకోకూడదు.

మార్చి నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మరోవైపు
పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమాంతరంగా సాగుతున్నాయి కాబట్టి.. ఏప్రిల్ నెలాఖరుకు ఫస్ట్ కాపీ
సిద్ధమౌతుందని అంచనా వేస్తున్నారు. అయితే మరోవైపు ఆచార్య విడుదల వాయిదాపడే
అవకాశాలున్నాయంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.