పవన్, అనసూయ.. ఓ ఐటెంసాంగ్

చావుకబురు చల్లగా అనే సినిమాలో అనసూయ ఐటెంసాంగ్ చేసింది. అయితే దాన్ని ఐటెం సాంగ్ అంటే
అనసూయ ఒప్పుకోదు. ఈ సంగతి పక్కనపెడితే, పవన్ కల్యాణ్ సినిమాలో కూడా ఆమె ఐటెంసాంగ్
చేసింది. దాని షూటింగ్ కూడా పూర్తయింది.

పవన్-క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనసూయ
ఐటెంసాంగ్ చేసింది. ఈ పాటలో అనసూయతో పాటు మరో బ్యూటీ పూజిత పొన్నాడ కూడా చిందేసింది.
అయితే పవన్ సినిమాలో తను ఐటెంసాంగ్ చేసిన విషయాన్ని అనసూయ కన్ ఫర్మ్ చేయలేదు. తను ఆ
సినిమా ఉన్నానని మాత్రమే చెబుతోంది.

ఈ సినిమాకు హరహర వీరమల్లు అనే టైటిల్ అనుకుంటున్నారు. శివరాత్రికి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్
పోస్టర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు పవన్ లుక్ ఆల్రెడీ సోషల్ మీడియాలో లీక్
అవ్వడం ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది.