ఈసారి సంక్రాంతికి గట్టి పోటీ

గతేడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు ఎలా పోటీపడ్డాయో అందరం
చూశాం. రెండు సినిమాలు బాక్సాఫీస్ బరిలో హోరాహోరీ తలపడ్డాయి. ఈ ఏడాది సంక్రాంతికి అలాంటి
పోటీ కనిపించలేదు. అల్లుడు అదుర్స్, రెడ్, క్రాక్, మాస్టర్ లాంటి సినిమాలు తలపడినప్పటికీ.. క్రాక్
సినిమా క్లీన్ స్వీప్ చేసేసింది. ఆ మూవీ దరిదాపులకు కూడా మరో సినిమా చేరుకోలేకపోయింది.

అయితే వచ్చే ఏడాది సంక్రాంతి మాత్రం మరోసారి 2020 పొంగల్ ను రిపీట్ చేయబోతోంది. అవును.. వచ్చే ఏడాది సంక్రాంతికి పవన్, మహేష్ సినిమాలు పోటీపడబోతున్నాయి.

మహేష్ నటిస్తున్న సర్కారువారి పాట సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే
మేకర్స్ ప్రకటించారు. ఇటు క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న హరహర వీరమల్లు అనే సినిమాను కూడా
సంక్రాంతికి తీసుకొచ్చే ఏర్పాట్లలో ఉన్నారు మేకర్స్.

పవన్ సినిమా కూడా సంక్రాంతికి లాక్ అయితే మరోసారి బాక్సాఫీస్ సంగ్రామం తప్పదు. అంతేకాదు.. ఇక
మరో పెద్ద హీరో సంక్రాంతికి వచ్చే సాహసం చేయడు.