గాలి సంపత్ చెప్పే గాలి కబుర్లు

ఈరోజు గాలిసంపత్ ట్రయిలర్ రిలీజైంది. ఈ సినిమాకు గాలి సంపత్ అనే పేరు ఎందుకు పెట్టారో
ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. సినిమాలో రాజేంద్రప్రసాద్ గాలి మాటలు చెబుతాడు. అంటే
పనికిమాలిన కబుర్లు అని అర్థంకాదు. ఆయనకు మాటలు రావు. ఏది మాట్లాడినా నోటి నుంచి గాలి
మాత్రమే వస్తుంది. అందుకే అతడి పేరు గాలి సంపత్ అయింది. ఈ విషయాన్ని ఈరోజు రిలీజైన
ట్రయిలర్ లో సూటిగా చెప్పేశారు.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. తండ్రికొడుకు సెంటిమెంట్ తో గాలిసంపత్ తెరకెక్కిందనే విషయాన్ని ట్రయిలర్ లో చెప్పారు. `పిల్లలు త‌ప్పు చేస్తే త‌ల్లిదండ్రులు చాలా ఓపిగ్గా ప్రేమ‌గా క‌రెక్ట్ చేస్తారు..అదేంటో కాస్త మీసాలు వ‌చ్చేస‌రికి పెద్దొళ్లు ఏం చేసినా ఊరికే చిరాకులు వ‌చ్చేస్తాయి.. కోపాలు వ‌చ్చేస్తాయి.. నేను కూడా మా నాన్నని కాస్త ఓపిగ్గా ప్రేమ‌గా అడ‌గాల్సింది సార్ అంటూ సాగే ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంటోంది.

లవ్లీ సింగ్ హీరోయిన్ గా, అనీష్ కృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాను మార్చి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనీల్ రావిపూడి మాటలు, స్క్రీన్ ప్లే అఁదించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షకుడిగా కొనసాగుతున్నాడు.