విరాటపర్వం స్థానంలో నారప్ప

narappa-may-14-release

లెక్కప్రకారం విరాటపర్వం సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాత 2 వారాల గ్యాప్ లో నారప్ప సినిమా రావాలి. కానీ ఇప్పుడు ప్లాన్ మారింది. విరాటపర్వం సినిమాను మరోసారి వాయిదా వేశారు. ఆ తేదీకి నారప్ప సినిమాను తీసుకొస్తున్నారు.

చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా మే 13న థియేటర్లలోకి రాబోతోంది. అదే తేదీకి నారప్పను కూడా షెడ్యూల్ చేశారు. అందుకే అనవసర పోటీని తప్పించేందుకు నారప్పను కాస్త ముందుగానే థియేటర్లలోకి తీసుకురావాలని సురేష్ బాబు నిర్ణయించారు. దీనికోసం విరాటపర్వం సినిమాను వాయిదా వేశారు.

నిజానికి నారప్ప సినిమానే వాయిదా వేయొచ్చు. కానీ అలా చేయడం వల్ల తిరిగి వెంకీ సినిమాలతోనే క్లాష్ ఏర్పడే అవకాశం ఉంది. వెంకీ నటిస్తున్న ఎఫ్3 సినిమా ఆగస్ట్ 27కు షెడ్యూల్ అయింది. ఆ తర్వాత దృశ్యం-2ను కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు వెంకీ. సో.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని.. నారప్పను వాయిదా వేసే కంటే, విరాటపర్వంను పోస్ట్ పోన్ చేయడం ఉత్తమమని భావించాడు నిర్మాత సురేష్ బాబు.