పూరి కొడుకు ‘రొమాంటిక్’గా వస్తున్నాడు

త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తోన్న ‘రొమాంటిక్’ మూవీకి డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్ క‌థ‌,
స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆయ‌న శిష్యుడు అనిల్ పాదూరి డైరెక్ట‌ర్‌గా
ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. కేతికా శ‌ర్మ హీరోయిన్.

‘ఇస్మార్ట్ శంక‌ర్’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై
పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘రొమాంటిక్’ రిలీజ్ డేట్‌ను ఈరోజు స్టైల్‌గా అనౌన్స్ చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూన్ 18న ఈ చిత్రాన్ని
విడుద‌ల చేయ‌నున్నారు. రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌లో టైటిల్‌కు న్యాయం చేస్తూ.. కదులుతున్న బ‌స్ డోర్ ద‌గ్గ‌ర‌
హీరోయిన్ కేతికా శ‌ర్మ‌ను ఆకాష్ లిప్ లాక్ చేస్తుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఒక ముఖ్య పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్న ఈ చిత్రం ఇంటెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా
రూపొందుతోంది. సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తుండ‌గా, న‌రేష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.