పుష్పక విమానం ఎక్కిన దేవరకొండ

‘‘దొరసాని’’ లాంటి మంచి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో ఆనంద్ దేవరకొండ తన
రెండో చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆనంద్ తన
మూడో సినిమాగా “పుష్పక విమానం” అనే ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేస్తున్నాడు.

దామోదర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఈ
సినిమాకు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా
ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్
ఎర్రబెల్లి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. . ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.

న్యూస్ ఛానెల్స్ లో వచ్చిన ఓ వార్త చూసి స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు దామోదర.
ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపించనున్నాడు. ఈ కథ ప్రధానంగా
మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామాని గుర్తుచేస్తూ, పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని
చూపెడుతుంది. ఇందులో ఆనంద్ తో పాటు సునీల్, నరేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శాన్వి
మేఘన, గీత్ సాయి హీరోయిన్స్ పరిచయమౌతున్నారు.