పవన్-మహేష్ మధ్య సంక్రాంతి పోటీ

వచ్చే ఏడాది సంక్రాంతికి ఇంకా చాలా టైమ్ ఉంది. కానీ సినీజనాలు మాత్రం ఆగేలా లేరు. ఇప్పట్నుంచే
సంక్రాంతికి కర్చీఫ్ లు వేయడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా మహేష్ బాబు ఆల్రెడీ తన సినిమాను
సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించగా.. ఇప్పుడీ రేసులోకి పవన్ కల్యాణ్ వచ్చి చేరాడు.

అవును.. మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట, పవన్-క్రిష్ కాంబోలో వస్తున్న వీరమల్లు సినిమాలు
వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీపడబోతున్నాయి. ఈ మేరకు వీరమల్లు సినిమా యూనిట్ నుంచి తాజాగా
ప్రకటన వచ్చేసింది.

మహేష్-పవన్ ఇలా పోటీపడడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. ఇంకా చెప్పాలంటే ఇది ఐదోసారి.
రాజకుమారుడు-తమ్ముడు సినిమాలు 2 వారాల గ్యాప్ లో వచ్చాయి. బద్రి-యువరాజు సినిమాలు వారం
గ్యాప్ లో వచ్చాయి. ఇక గుడుంబాశంకర్-అర్జున్ సినిమాలు నెల గ్యాప్ లో వచ్చాయి. పోకిరి-బంగారం
సినిమాలు కూడా నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. ఇప్పుడు వీరమల్లు, సర్కారువారి పాట సినిమాలు ఒకే
రోజు థియేటర్లలోకి వస్తున్నాయి.