మర్యాద కృష్ణయ్యగా మారిన రామయ్య

సునీల్ హీరోగా వి.ఎన్‌. ఆదిత్య ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న హిలేరియ‌స్ ఫ‌న్ ఫిల్మ్‌కు ‘మ‌ర్యాద
క్రిష్ణ‌య్య’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఇంతకుముందు మర్యాద రామన్నగా అలరించిన సునీల్.. ఈ
సినిమాతో మర్యాద కృష్ణయ్య గా మారిపోయాడు.

ఏటీవీ ఒరిజిన‌ల్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై కిశోర్ గ‌రిక‌పాటి, టీజీ
విశ్వ‌ప్ర‌సాద్‌, అర్చ‌నా అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సునీల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో సునీల్
దేన్నో చూసి షాక‌వుతున్న‌ట్లుగా పోజ్ ఇచ్చాడు. టైటిల్ ఆస‌క్తిగొల్పుతుండ‌గా, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్
ఇంప్రెసివ్‌గా అనిపిస్తోంది.

వివేక్ కూచిభొట్ల స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ మూవీకి సాయికార్తీక్ మ్యూజిక్ స‌మ‌కూరుస్తున్నారు.
దాము న‌ర్రావుల సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా, లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ రాస్తున్నారు.