పుష్ప డైలాగ్ బయటపెట్టిన బన్నీ

పుష్ప సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా బన్నీ-రష్మిక మధ్య ఓ రొమాంటిక్ సాంగ్
తీశారు. తర్వాత తమిళనాడులో మరికొన్ని యాక్షన్ సీన్స్ తీశారు. సినిమాలో పాటలు బాగున్నాయని
తెలుసు, కథ కూడా కొత్తగా ఉంటుందని తెలుసు. మరి డైలాగ్స్ సంగతేంటి? ఈ విషయాన్ని స్వయంగా
అల్లు అర్జున్ బయటపెట్టాడు

చావు కబురు చల్లగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన బన్నీ.. పుష్ప వివరాలు బయటపెట్టాడు. సినిమాలో
డైలాగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయని పరోక్షంగా వెల్లడించాడు. ఈ సందర్భంగా పుష్పకు సంబంధించి ఓ
డైలాగ్ కూడా బయటపెట్టాడు. “తగ్గేది లేదు” అంటూ చిత్తూరు యాసలో ఓ డైలాగ్ చెప్పాడు.

బన్నీ చెప్పిన డైలాగ్ వింటుంటే.. సినిమాలో అది బన్నీ ఊతపదంలా అనిపిస్తోంది. పుష్పలో బన్నీకి ఓ
ఊతపదం ఉంటుందని సుకుమార్ చాన్నాళ్ల కిందటే బయటపెట్టాడు. ఆ ఊతపదమే ఇదంటూ ప్రస్తుతం
ప్రచారం సాగుతోంది. పంద్రాగస్ట్ కానుకగా ఆగస్ట్ 13న థియేటర్లలోకి రాబోతోంది పుష్ప. సుకుమార్ డైరక్ట్
చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.