నాని శ్రీకారం చుట్టాలనుకున్నాడు

శివరాత్రి కానుకగా రేపు థియేటర్లలోకి రాబోతోంది శ్రీకారం సినిమా. వ్యవసాయం బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ
సినిమాలో శర్వానంద్ హీరో. అయితే ఈ సినిమా వెనక చాలా పెద్ద కథ నడిచింది. నిజానికి ఈ సినిమా
చేయాల్సింది శర్వానంద్ కాదు. హీరో నాని.

అవును.. నాని హీరోగా శ్రీకారం అనుకున్నారు. నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే అదే టైమ్ లో
మహేష్ నటించిన మహర్షి సినిమా రిలీజ్ అవ్వడం.. శ్రీకారం కోసం అనుకున్న కొన్ని సన్నివేశాలు
అందులో ఉండడంతో.. నాని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడు మరికొన్ని కొత్త
సీన్స్ రాసుకొని, శర్వానంద్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాడు.

అలా నాని చేయాల్సిన శ్రీకారం సినిమా శర్వానంద్ చేతిలోకి వెళ్లింది. అన్నట్టు ఈ సినిమా కోసం తిరుపతి
సమీపంలో 40 ఎకరాల పొలం తీసుకొని నిజంగానే వ్యవసాయం చేశారు. అలా సినిమా కోసం పండించిన
పంటల మధ్యే షూటింగ్ చేశారు.