లిప్ కిస్సులకు ఇంకా టైమ్ ఉంది

ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి.
ఇప్పుడు హీరోగా తన రెండో సినిమా జాతిరత్నాలు చేస్తున్నాడు. రేపు ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నవీన్.. పాత్రల ఎంపిక విషయంలో తన ఆలోచన విధానాన్ని
బయటపెట్టాడు. మరీ ముఖ్యంగా లవ్ స్టోరీలు, లిప్ కిస్సులకు సంబంధించి తన అభిప్రాయాల్ని
ఉన్నదున్నట్టు చెప్పేశాడు.

“ముందుగా థ్రిల్లర్ సినిమా చేశాను. జాతిరత్నాల్లో చిన్న లవ్ ట్రాక్ ఉంది. అన్నీ కుదిరితే కంప్లీట్ లవ్ స్టోరీ త్వరలోనే చేస్తాను. ఆ తర్వాత లిప్ కిస్సుల గురించి ఆలోచిస్తాను. ఇప్పటికిప్పుడు అర్జున్ రెడ్డి లాంటి
సినిమా చేసేయాలని లేదు. నిజానికి బోల్డ్ గా కనిపించాలని, బోల్డ్ గా నటించాలనే ఆలోచనతో ఎవ్వరూ
కథలు ఒప్పుకోరు. నేను కూడా అంతే. నాకొచ్చే కథల్లో బోల్డ్ నెస్ ఉంటే నేను కాదనను. అంతే తప్ప
ఏరికోరి బోల్డ్ సీన్లు కావాలని అడగను.”

ఇలా పాత్రల ఎంపికపై తన అభిప్రాయాల్ని బయటపెట్టాడు నవీన్ పొలిశెట్టి. రేపు థియేటర్లలోకి
రాబోతున్న జాతిరత్నాలు సినిమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా చెబుతున్నాడు
నవీన్. సినిమాలో హీరో అంటూ ఎవ్వరూ ఉండరని.. తను, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురం
మూడు పాత్రలు పోషించామని చెబుతున్నాడు.