సందీప్ వంగ దర్శకత్వంలో మహేష్

అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్టయిన వెంటనే సందీప్ రెడ్డి వంగకు ఆఫర్ ఇచ్చాడు మహేష్ బాబు.
మంచి కథ సెట్ అయితే సినిమా చేద్దామన్నాడు. కానీ మహేష్ ను సరైన కథతో ఒప్పించలేకపోయాడు
సందీప్. అప్పట్నుంచి ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయిపోయారు. ఎట్టకేలకు మహేష్-సందీప్ రెడ్డి
కలుస్తున్నారు.

అయితే వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయడం లేదు. ఓ యాడ్ షూటింగ్ కోసం కలిశారు. ఓ టెలివిజన్
కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి ఒప్పుకున్నాడు మహేష్. ఆ కంపెనీకి సంబంధించిన
షూటింగ్ వ్యవహారాల్ని సందీప్ కు అప్పగించారు. అలా మహేష్-సందీప్ కలిసి ఒక రోజంతా యాడ్ కోసం
పనిచేయబోతున్నారన్నమాట.

ప్రస్తుతం మహేష్ సర్కారువారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత అనీల్ రావిపూడి
దర్శకత్వంలో సినిమా చేస్తాడు. ఆ తర్వాత రాజమౌళితో సినిమా ఉండనే ఉంది. ఇటు సందీప్ రెడ్డి వంగ,
యానిమల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. వీళ్లిద్దరూ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారో చూడాలి.