గ్రామీ విజేతలు వీరే..

ఎప్పటినుంచో వాయిదా పడుతున్న హాలీవుడ్‌ 63వ గ్రామీ అవార్డ్స్‌ అవార్డు ఫంక్షన్‌ నిన్న మార్చి 14న లాస్‌ఎంజిల్స్‌లో జరిగింది. మ్యూజిక్‌ ఇండస్ట్రీలో జరిగే పాపులర్‌ అవార్డుల వేడుక ఇది. ఇందులో రకరకాల కేటగీరీల్లో ఉత్తమ సాంగ్, ఉత్తమ ఆర్టిస్ట్ లకు ప్రపంచ ప్రఖ్యాత గ్రామీ అవార్డు ఇస్తారు. అయితే ఈ సారి అవార్డుల్లోఅత్యధికంగా 28 ట్రోఫీలను గెలుచుకుని బియోన్సే చరిత్ర సృష్టించింది.

మిగతా విజేతలెవరంటే..
సాంగ్ ఆఫ్ ది ఇయర్: ‘ఐ కాంట్ బ్రీత్’ బై హెచ్‌.ఈ.ఆర్‌
రికార్డ్ ఆఫ్ ది ఇయర్: ‘ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్’ బై బిల్లీ ఎలిష్
ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్: ‘ఫోక్‌లోర్‌’ బై టేలర్ స్విఫ్ట్
ఉత్తమ రాక్ సాంగ్: ‘స్టే హై’ బై బ్రిటనీ హోవార్డ్
ఉత్తమ రాక్ ఆల్బమ్: ‘ది న్యూ ఆబ్‌నార్మల్‌’ బై ది స్ట్రోక్స్
ఉత్తమ పాప్ సోలో ప్రదర్శన: ‘వాటర్‌మిలాన్‌’ బై హ్యారీ స్టైల్స్
ఉత్తమ ర్యాప్ సాంగ్: ‘సావేజ్‌’ బై మేగాన్ తీ స్టాలియన్
ఉత్తమ ర్యాప్ ఆల్బమ్: ‘కింగ్స్ డిసీజ్’ బై నాస్
ఉత్తమ నూతన ఆర్టిస్ట్‌: మేగాన్ దీ స్టాలియన్