రిలీజ్ అవ్వకుండానే జాతీయ అవార్డు.. ఇంతకీ రిలీజ్ ఎప్పుడంటే..

ఎప్పుడూ లేని విధంగా ఈసారి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు ఇంకా రిలీజ్ అవ్వని చిత్రానికి దక్కింది. మోహన్‌లాల్‌ నటించిన మరక్కార్‌ మళయాల‌ చిత్రానికి గాను ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో అవార్డు లభించింది. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకపోవడం విశేషం.
67వ జాతీయ చలన చిత్ర అవార్డులను సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకున్న మరక్కార్ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా గతేడాది మార్చి 26న విడుదలకావాల్సి ఉంది. లాక్‌ డౌన్‌ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. అయితే ఈ చిత్రానికి గతేడాదే సెన్సార్‌ బోర్డు నుంచి క్లియరెన్స్‌ రావడంతో ఈ చిత్రాన్ని 2020లో వచ్చిన చిత్రంగా పరిగణించి అవార్డు ఇచ్చారు. అయితే ఉత్తమ చిత్రంగా నిలిచిన మరక్కార్ సినిమాను ధియేటర్ లో చూడాలంటే మే 19 వరకూ ఆగాల్సిందే.