ఐపీయల్ కొత్త సాంగ్ విన్నారా?

ఏప్రిల్ 9 నుంచి మొదలు కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021కు సంబంధించి ఓ కొత్త సాంగ్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ‘ఇండియాకా అప్నా మంత్ర’ పేరిట విడుదలైన ఈ పాట ఒకటిన్నర నిమిషాలు ఉంది.

ప్రతి సీజన్ కోసం డిఫరెంట్ స్టైల్‌లో సాంగ్ రిలీజ్ చేసే బీసీసీఐ ఈ ఏడాది సీజన్‌కు సంబంధించి అఫీషియల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. అయతే ఇందులో ఐపీయల్ గీతం ఇండియా సక్సెస్ మంత్రంగా అభివర్ణిస్తూ రూపొందించింది. అయితే సోషల్ మీడియాలో ఈ పాటకు ట్రోల్స్ వస్తున్నాయి. ఇందులో స్కూల్‌ పిల్లలు, వృద్ధులతో పాటు కోహ్లీ, రోహిత్ శర్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, సాహా, రియాన్ పరాగ్, కృష్ణప్ప గౌతమ్ తో సహా అందరూ ఆటగాళ్లను సాంగ్‌లో డ్యాన్స్ చేశారు. అయితే మొత్తంగా నెటిజన్లకు మాత్రం ఈ సాంగ్ అంతగా నచ్చనట్టు ట్రోల్స్ ను బట్టి తెలుస్తోంది.