ఆచార్యతో కలిసొచ్చిన సిద్ధ

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య యూనిట్ ఓ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈసారి మరింత కిక్ ఇచ్చేలా ఉంది పోస్టర్. నిజానికి పుట్టినరోజు నాడు చరణ్ లుక్ ఒక్కటే వస్తుందని అంతా భావించారు. కానీ ఏకంగా చిరంజీవి-చరణ్ కలిసున్న స్టిల్ రిలీజ్ చేసి మెగా పండగ తీసుకొచ్చింది ఆచార్య యూనిట్.

ఆచార్య సినిమాలో ఆచార్యగా చిరు, సిద్ధగా రామ్ చరణ్ కనిపిస్తున్నారు. సినిమాలో ఇద్దరూ నక్సలైట్లే. వాళ్ల గెటప్స్ ను ఈరోజు రిలీజ్ చేశారు. ఇద్దరి లుక్ అదిరిపోయింది.

సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. మే 13న సినిమాను వరల్డ్ వైడ్ థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. కాజల్, పూజా హెగ్డే ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.