వాణీదేవికి బంపర్​ ఆఫర్​..! చైర్మన్​ లేదా డిప్యూటీ చైర్మన్​?

ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన వాణీదేవికి కీలక పోస్టు ఇవ్వాలని సీఎం కేసీఆర్​ భావిస్తున్నారట. ఆమెకు మండలి చైర్మన్​, లేదా డిప్యూటీ చైర్మన్​ పదవి ఇవ్వాలని కేసీఆర్​ యోచిస్తున్నారట. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో సీఎం కేసీఆర్​ అనూహ్యంగా వాణీదేవి పేరును తెరమీదకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పక్కా ప్రణాళికతో ఆమెను గెలిపించుకున్నారు సీఎం కేసీఆర్​. ఇదిలా ఉంటే ఆమెకు కీలక పోస్టు ఇవ్వాలని కూడా సీఎం అనుకుంటున్నారట.

వాణీదేవి.. దివంగత ప్రధాని పీవీ కుమార్తె అన్న విషయం తెలిసిందే. అయితే ప్రధాని పీవీ నరసింహా రావుకు కాంగ్రెస్​ తగిన రీతిలో గౌరవం ఇవ్వలేదని సీఎం కేసీఆర్​ విమర్శించారు. అందులో భాగంగానే పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆమె కూతురు వాణీదేవికి తగిన ప్రాధాన్యత కల్పించాలని సీఎం యోచిస్తున్నారట.

మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ పదవీకాలం ఈ ఏడాది జూన్‌ మొదటి వారంలో ముగియనుంది. ఆ తర్వాత పీవీ కూతురు వాణీదేవిని మండలి చైర్మన్​.. లేదా డిప్యూటీ చైర్మన్​గా నియమించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం మండలిలో బ్రాహ్మణ/కరణం సామాజికవర్గం నుంచి పురాణం సతీష్, శాసనసభలో వొడితెల సతీష్‌కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే సామాజికవర్గానికి చెందిన వాణీదేవికి మండలి చైర్మన్‌ లేదా డిప్యూటీ చైర్మన్‌ పదవిని అప్పగిస్తే ఆ సామాజికవర్గం తమ వెంట ఉంటుందని గులాబీ బాస్​ లెక్కలు వేసుకుంటున్నారట.‌