ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రమాదమా?

మన దేశంలో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ మొదలైన సూచనలు క‌నిపిస్తున్నాయి. రోజుకి వేలసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే మొదటి వేవ్‌లో విజృంభించిన కరోనా కంటే ఇది మరింత ప్రమాదమంటున్నారు నిపుణులు.. కారణమేంటంటే..

గతేడాది కరోనా భారీగా ఉన్న రోజుల్లో అంటే జూలై, ఆగస్టు నెలల్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 30వేల నుంచి 60వేలకు పెరగడానికి 23 రోజుల వ్యవధి పట్టింది. అయితే ఇప్పుడు ఆ వ్యవధి తగ్గుతూ వస్తుంది. ఒక్క శుక్రవారమే 60 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉంది. అంతేకాదు.. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఇప్పడిప్పుడే కేసుల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. తమిళనాడు, కర్నాటకలో రోజుకు 2వేలకు పైగా కేసులు నమోదువుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్ర మాదిరిగా కేసులు సంఖ్య పెరుగుతూ పోతే.. కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అలాగే దేశంలో ఎక్కువగా జనాభా కలిగి ఉండే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ లలో ఇంకా సెకండ్ వేవ్ మొదలవ్వలేదు. అన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ విజృంభన మొదలైతే.. పరిస్థితి గతేడాది కంటే తీవ్రంగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు