పాన్, ఆధార్ లింక్ కు ఈరోజే లాస్ట్ డేట్..

ఆధార్ కార్డుతో పాన్‌కార్డు లింక్ చేయాలని కేంద్రం ఎప్పటి నుంచో చెప్తున్న సంగతి తెలిసిందే. అయితే నేటితో ఆ గడువు ముగియనుంది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కనుక మార్చి 31లోపు ఆధార్ కార్డును పాన్ తో లింక్ చేసుకోవాలి. లింక్ చేయకపోతే బ్యాంకు లావాదేవీలలో ఇబ్బందులు రావొచ్చు. అంతేకాకుండా.. భారీ జరిమానా కూడా క‌ట్టాల్సిన ప‌రిస్థితి రావొచ్చు. అందుకే ఈ రెండు కార్డుల‌ను అనుసంధానం చేసుకోని వాళ్లు ఈ రోజు చేసుకోవడం బెటర్. ఇన్ కమ్ ట్యాక్స్ ఇండియా వెబ్ సైట్ ద్వారా ఆధార్ లింక్ చేసుకోవచ్చు.