ఏపీలో పరిషత్​పోరుకు రేపే నోటిఫికేషన్​..!

ఆంధ్రప్రదేశ్​లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం రేపే నోటిఫికేషన్​ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్​కుమార్​ పదవీకాలం నేటితో ముగిసిపోనున్న విషయం తెలిసిందే. కొత్త ఎస్​ఈసీగా నీలం సాహ్ని రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె చార్జ్​ తీసుకున్న వెంబడే పరిషత్​ పోరుకు నోటిఫికేషన్​ జారీ చేయనున్నట్టు సమాచారం.

ఏప్రిల్ 8న పరిషత్​ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇక 10న కౌంటింగ్​ చేపడతారని సమాచారం. ఎన్నికల కమిషనర్​గా నేటితో నిమ్మగడ్డ పదవీకాలం ముగియనున్నది. పంచాయతీ, మున్సిపల్​ ఎన్నికలు నిమ్మగడ్డ ఆధ్వర్యంలో సాగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఎన్నికల నిర్వహణపై తీవ్ర గందరగోళం నెలకొన్నది. కరోనా టైంలో ఎన్నికలు వద్దని ప్రభుత్వం.. పెట్టి తీరాల్సిందేనంటూ నిమ్మగడ్డ పట్టుబట్టి కూర్చున్నారు. చివరకు కోర్టు జోక్యంతో ఎన్నికలు జరిగాయి.

ఎస్​ఈసీ నిమ్మగడ్డ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని.. వైసీపీ నేతలు బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. మరోవైపు నిమ్మగడ్డ కూడా అధికారులను బదిలీ చేస్తూ.. జిల్లాల్లో పర్యటిస్తూ తీవ్ర హడావుడి చేశారు. చివరకు ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.

ఇదిలా ఉండగా రేపు ఎస్​ఈసీగా నీలం సాహ్ని కొత్త ఎస్ ఈఎస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.ఆమె కొంతకాలం పాటు ఏపీ ప్రభుత్వానికి సీఎస్​గా పనిచేశారు.