వాయిదా పడిన వకీల్ సాబ్ ఈవెంట్

లెక్కప్రకారం 3వ తేదీన వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అనుకున్నారు. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్
అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో శిల్పకళా వేదిక అనుకున్నారు.
అక్కడ కూడా పర్మిషన్ దొరికేలా లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల మధ్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను వాయిదా
వేశారు.

ఒక రోజు ఆలస్యంగా ఈనెల 4వ తేదీన వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరుగుతోంది. వేదికను మాత్రం
ఇంకా ఖరారు చేయలేదు. అభిమానుల సమక్షంలో కాకుండా, పరిమిత సంఖ్యలో ఆడియన్స్ మధ్య
ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేయాలని నిర్ణయించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే హెచ్ఐసీసీలో ఈ వేడుక జరిగే
అవకాశం ఉంది.

ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ తో పాటు చిరంజీవి, రామ్ చరణ్ కూడా వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఆఖరి నిమిషంలో రామ్ చరణ్ డ్రాప్
అయినా, చిరంజీవి రావడం మాత్రం పక్కా. ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రాబోతోంది వకీల్ సాబ్.