టాలీవుడ్ ను గట్టిగా తాకిన కరోనా

కరోనా సెకెండ్ వేవ్ టాలీవుడ్ ను గట్టిగా తాకింది. మొదటి దశలో టాలీవుడ్ ప్రముఖులు పెద్దగా కరోనా
బారిన పడలేదు. అయితే ఈసారి మాత్రం వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు పాజిటివ్ గా
నమోదవుతున్నారు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కరోనా సోకింది. బాధాకరమైన విషయం ఏంటంటే..
ఆయన రెండు మోతాదుల్లో వ్యాక్సిన్ కూడా తీసుకున్నప్పటికీ, కరోనా సోకింది.

దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత వివేక్ కూచిబొట్ల కూడా కరోనా బారిన పడినట్టు వార్తలొస్తున్నాయి. అయితే
వీళ్లిద్దరూ వారం రోజుల క్వారంటైన్ తోనే కోలుకున్నట్టు సమాచారం. వీళ్లతోపాటు మరికొందరు సినీ
ప్రముఖులకు కూడా కరోనా సోకినప్పటికీ వాళ్ల పేర్లు బయటకురాలేదు.

ఇక హీరోయిన్లలో తాజాగా నివేత థామస్ కరోనా బారిన పడింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఈమెకు
పాజిటివ్ గా తేలింది. ఇలా టాలీవుడ్ ను కరోనా సెకెండ్ వేవ్ గట్టిగానే తాకింది. రాబోయే రోజుల్లో ఇది ఏ
దశకు చేరుకుంటుందో చూడాలి.