వకీల్ సాబ్ వసూళ్లపై అనుమానాలు

ఈనెల 9న భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది వకీల్ సాబ్ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో అటుఇటుగా 78 కోట్ల
రూపాయల ప్రీ-రిలీజ్ చేసింది ఈ సినిమా. కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప బయ్యర్లు కోలుకోరు. ఈ మేరకు దిల్ రాజు అన్ని ఏర్పాట్లు చేశాడు.

వకీల్ సాబ్ సినిమాకు సోలో రిలీజ్ ప్లాన్ చేశాడు దిల్ రాజు. మ్యాగ్జిమ్ థియేటర్లు దీనికే వస్తున్నాయి. అటు బెనిఫిట్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఊహించని విధంగా కరోనా కేసులు పెరగడం ఈ సినిమాకు ఇప్పుడు అతిపెద్ద ప్రతిబంధకంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తొలి దశ కంటే రెండో దశ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ పెడుతున్నారు. తెలంగాణలో ఇంకా ఆ దిశగా ఆలోచన చేయలేదు. ఈ క్రమంలో థియేటర్లలో ఆక్యుపెన్సీని మళ్లీ 50 శాతానికి కుదించే ఆలోచన చేస్తున్నారు. అదే కనుక జరిగితే వకీల్ సాబ్ వసూళ్లకు ఇబ్బందే.