పవన్ నడిచొస్తే ఏం జరుగుతుంది?

మొన్నటికి మొన్న పవన్ కల్యాణ్ పై రియాక్ట్ అయింది హీరోయిన్ నిధి అగర్వాల్. పవన్ సెట్స్ లో ఉంటే
అంతా సైలెంట్ గా ఉంటుందని, అందరూ పవన్ నే చూస్తూ ఉండిపోతారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరో హీరోయిన్ అంజలి కూడా దాదాపు ఇదే విషయాన్ని చెబుతోంది.

“పవన్ కల్యాణ్ అలా నడిచొస్తుంటే అంతా సైలెంట్ అయిపోతారు. సెట్ అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది.
నా వరకు వస్తే పవన్ తో మాట్లాడ్డానికి నాకు 15 రోజులు పట్టింది. ఇంత క్రేజ్, ఇంత అనుభవం
ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ లో అదే నిబద్ధత.”

వకీల్ సాబ్ సినిమాలో పవన్ తో కలిసి నటించింది అంజలి. ఆ సినిమా టైమ్ లో దాదాపు 20 రోజుల పాటు
పవన్ తో కలిసి నటించిన అంజలి.. అతడ్ని చూసి చాలా నేర్చుకున్నానని చెబుతోంది. అంత స్టార్ డమ్
ఉన్నప్పటికీ పవన్ సింపుల్ గా ఉండడం తనకు బాగా నచ్చిందంటోంది.

వకీల్ సాబ్ సినిమాలో తను చేసిన కోర్టు సీన్ చూసి సెట్స్ లో పవన్ చప్పట్లు కొట్టి మరీ తనను
అభినందించారని, ఆ ఘటనను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని చెప్పుకొచ్చింది ఈ టాలీవుడ్ సీతమ్మ.