వకీల్ సాబ్ కోసం 100 స్క్రీన్స్

వకీల్ సాబ్ కోసం అన్ని లైన్స్ క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న చాలా సినిమాల్ని
ఎత్తేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60శాతం థియేటర్లను గంపగుత్తగా వకీల్ సాబ్ కు కట్టబెట్టే
ప్రయత్నం తెరవెనక శరవేగంగా సాగిపోయింది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఒక్క హైదరాబాద్ లోనే వకీల్ సాబ్ సినిమాకు 110 స్క్రీన్స్ కేటాయించారు.
రాబోయే రోజుల్లో మరిన్ని స్క్రీన్స్ యాడ్ అవ్వబోతున్నాయి. లాక్ డౌన్ ముందు అయినా, లాక్ డౌన్
తర్వాతైనా ఓ సినిమాకు ఈ స్థాయిలో స్క్రీన్స్ దొరకడం ఇదే తొలిసారి.

వకీల్ సాబ్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 78 కోట్ల రూపాయలకు అమ్మారు. ఈ వసూళ్లలో కనీసం 60శాతం
పెట్టుబడిని తొలి 3 రోజుల్లోనే పిండేయాలనేది బయ్యర్లు, నిర్మాతల ప్లాన్. ఇందుకు తగ్గట్టే థియేటర్ల కౌంట్
పెంచడంతో పాటు, టిక్కెట్ రేట్లు కూడా పెంచబోతున్నారు. ఇలా భారీ ఎత్తున 9వ తేదీన థియేటర్లలో
అడుగుపెట్టబోతున్నాడు వకీల్ సాబ్.