మరో సినిమా ప్రకటించిన విశాల్

ఇటీవ‌ల చ‌క్ర సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన యాక్ష‌న్ హీరో విశాల్ ప్ర‌స్తుతం త‌న
స్నేహితుడు ఆర్యతో క‌లిసి `ఎనిమి` సినిమా చేస్తున్నారు. ఆ సినిమా త‌ర్వాత శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో
తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఓ భారీ సినిమా చేయ‌బోతున్నారు. విశాల్ కెరీర్‌లో 31వ చిత్రంగా
రూపొందుతున్న ఈ మూవీని విశాల్‌ ఫిలిం ఫ్యాక్ట‌రి బేన‌ర్ పై విశాల్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి
సంబందించి అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు మేక‌ర్స్‌.

ఈ సంద‌ర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు. న‌డుస్తున్న జ‌న‌సందోహం నుండి విశాల్ ఫేస్‌ని
చూపించారు. దానితో పాటు నాట్ ఎ కామ‌న్ మ్యాన్(#NotACommonMan) అనే హ్యాష్ టాగ్‌ను
జోడించారు.

ఈ మూవీకి యంగ్ మ్యాస్టో యువ‌న్‌శంక‌ర్‌రాజా సంగీతం అందిస్తుండ‌గా బాల‌సుబ్ర‌మ‌ణ్యం సినిమాటోగ్ర‌పి
భాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎస్ ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్ట‌ర్‌, ఎన్ బి శ్రీ‌కాంత్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వరలోనే ప్రకటిస్తామని
తెలిపారు మేక‌ర్స్‌.