వకీల్ సాబ్ లో పవన్ లుక్స్

vakeel saab movie pawan-kalyan-plan-change

వకీల్ సాబ్ సినిమాలో పవన్ కల్యాణ్ లాయర్ గా నటించాడే విషయం అందరికీ తెలిసిందే. టైటిల్
ప్రకటించినప్పుడే చాలామందికి దీనిపై క్లారిటీ వచ్చేసింది. పైగా పింక్ సినిమా రీమేక్ కాబట్టి మరో
ఆలోచనకు తావులేదు. అయితే ఇలా అందరికీ తెలిసిన క్యారెక్టర్ లోనే 3 షేడ్స్ ఉన్నాయంటున్నాడు
దర్శకుడు వేణు శ్రీరామ్.

వకీల్ సాబ్ సినిమాలో పవన్ 3 డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడట. ఒక షేడ్ లో లాయర్ గా, మరో కోణంలో
భర్తగా, ఇంకో కోణంలో మద్యానికి బానిసైన వ్యక్తిగా 3 రకాలుగా కనిపిస్తాడట. ఈ 3 షేడ్స్ ను పవన్ కల్యాణ్
అద్భుతంగా పండించాడని చెప్పుకొచ్చాడు వేణు శ్రీరామ్.

పింక్ సినిమా అందరికీ తెలిసినదే అయినప్పటికీ.. వకీల్ సాబ్ సినిమా మాత్రం చాలా కొత్తగా
ఉంటుందంటున్నాడు వేణుశ్రీరామ్. పవన్ ను దృష్టిలో పెట్టుకొని ఇందులో చేసిన మార్పుచేర్పులు
అందర్నీ ఎట్రాక్ట్ చేస్తాయని చెబుతున్నాడు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది వకీల్
సాబ్.