డబ్బింగ్ స్టార్ట్ చేసిన పుష్ప

కరోనా సెకెండ్ వేవ్ మొదలవ్వడంతో బడా సినిమాలన్నీ జాగ్రత్తపడ్డాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కు
సంబంధించి రాజమౌళి, ఆకస్మిక షెడ్యూల్ ఒకటి ఖరారు చేశాడు. అటు ఆచార్య మూవీ పనుల్ని కూడా
తొందరగా పూర్తిచేయాలని చిరంజీవి యూనిట్ ను ఆదేశించాడు. ఇప్పుడు పుష్ప కూడా అదే బాటలో
నడుస్తోంది.

ఓవైపు షూటింగ్ కొనసాగుతున్నప్పటికీ మరోవైపు డబ్బింగ్ ప్రారంభించారు. ఈరోజు నుంచి ఈ సినిమా
డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రస్తుతం అల్లు అర్జున్, తన కుటుంబ సభ్యులతో కలిసి
మాల్దీవుల్లో సేదతీరుతున్నాడు. అతడు వచ్చిన తర్వాత పరిస్థితులు అనుకూలిస్తే షూటింగ్ ఉంటుంది.
లేదంటే డబ్బింగ్ కొనసాగుతుంది.

ఇలా పుష్ప పనుల్ని వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు. మరోవైపు బన్నీ పుట్టినరోజు సందర్భంగా
సినిమాలోని పుష్పరాజ్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా మూవీకి
సంబంధించి మరిన్ని అప్ డేట్స్ బయటకొచ్చే ఛాన్స్ ఉంది.