శ్రీవిష్ణు నుంచి మరో సినిమా

టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే హీరోల్లో శ్రీవిష్ణు ఒకడు. హిట్స్, ఫ్లాపులతో సంబంధం
లేకుండా సినిమాలు చేసుకుపోతుంటాడు ఈ హీరో. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి మరో సినిమా
రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు.

విలక్షణ నటుడు, యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “భళా తందనాన”. ‘బాణం’
సినిమాతో దర్శకుడిగా పరిచయమైన చైతన్య దంతులూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ
చిత్రంలో శ్రీవిష్ణు సరసన కేథరిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాలో రామచంద్రరాజు విలన్ పాత్ర పోషిస్తున్నారు. రామచంద్రరాజు ‘కేజిఎఫ్’ చిత్రంలో గరుడగా
నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సాయి
కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.