మరో సినిమాకు పవన్ షిఫ్ట్

వకీల్ సాబ్ సినిమా వర్క్ పూర్తయింది. తన బాధ్యతగా ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. ఇప్పుడీ సినిమా రిజల్ట్ తో పవన్ కు అనవసరం. వెంటనే మరో సినిమాకు షిఫ్ట్ అయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా పనుల్ని పవన్ ఈరోజు ప్రారంభించాడు.

పవన్ పై ఈరోజు లుక్ టెస్ట్ నిర్వహించారు. సినిమాలో పవన్ లుక్ కు సంబంధించి 2-3 గెటప్స్ ప్రయత్నించారు. వీటిలో ఓ గెటప్ ను స్పాట్ లో ఫైనల్ చేశారు. ఈ లుక్ టెస్ట్ మొత్తం ఈరోజు అన్నపూర్ణ స్టుడియోస్ లో ప్రత్యేకంగా వేసిన చిన్న సెట్ లో జరిగింది.

గతంలో పవన్ కల్యాణ్ ను గబ్బర్ సింగ్ గా చూపించిన హరీష్ శంకర్.. ఈసారి పవన్ ను మరింత పవర్ ఫుల్ గా చూపిస్తానంటున్నాడు. యూత్ ఎలిమెంట్స్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమా, ఫ్యాన్స్స కు ఫుల్ మీల్స్ అంటున్నాడు.

ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు పవన్. ఈ మూవీ కొలిక్కి వచ్చినా, రాకపోయినా త్వరలోనే హరీష్ శంకర్ మూవీ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం ఖాయం.