ఆచార్యలో పూజా హెగ్డే పాత్ర ఇదే!

ఆచార్య సినిమాలో మెయిన్ హీరోయిన్ కాజల్. ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మూవీలో చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పుడీ పాత్రకు సంబంధించిన వివరాలు బయటకొచ్చాయి. ఆచార్య సినిమాలో నీలాంబరి అనే గిరిజన యువతి పాత్రలో పూజా హెగ్డే కనిపించనుంది.

సినిమాలో రామ్ చరణ్ ఓ నక్సలైట్. ఓ గ్రూప్ కు ప్రాతినిథ్యం వహిస్తుంటాడు. ఆ నక్సల్ గ్రూప్ కు ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఇన్ ఫార్మర్ గా పూజా హెగ్డే కనిపించనుంది. సినిమాలో చరణ్-పూజాకు మధ్య 2 పాటలున్నాయి. వీటిలో ఒకటి మాంటేజ్ సాంగ్. ఈ పాటను రంపచోడవరం అటవీ ప్రాంతంలో షూట్ చేశారు. మరో సాంగ్ షూటింగ్ పెండింగ్ లో ఉంది.

వచ్చేనెల ఆచార్య సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ షూటింగ్ లేట్ అవ్వడంతో మూవీ పోస్ట్ పోన్ అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొరటాల శివ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. టైటిల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడు.