సోనూసూద్ వ్యాక్సిన్ డ్రైవ్

కరోనా లాక్ డౌన్ కాలంలో వలస కార్మికులకు సాయం చేస్తూ.. రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఇప్పుడు సెకండ్ వేవ్ భయపెడుతున్న సందర్భంగా.. కోవిడ్ వ్యాక్సినేషన్ పై ఫోకస్ పెట్టారు.
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న సమయంలో .. సోనూ సూద్‌ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు కీలక విజ్ఞప్తి చేశారు. 25 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలని కోరారు. యువకులు, పిల్లలు కూడా ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారని ఆయన అన్నారు.

పంజాబ్, ‌అమృత్‌సర్‌లో బుధవారం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకున్న సోనుసూద్ వ్యాక్సినేషన్‌పై అవగాహన పెంచేందుకు ‘సంజీవని: ఏ షాట్ ఆఫ్ లైఫ్’ పేరుతో క్యాంపెయిన్ నిర్వహించారు. టీకా తీసుకునేలా ప్రజల్ని ప్రోత్సహించడానికి ముందుకొస్తున్నానంటూ.. ట్విట్టర్ లో ఓ వీడియోను షేర్ చేశారు. అతిపెద్ద టీకా డ్రైవ్‌ మొదలవుతుందంటూ ట్వీట్ చేశారు.