మూడోది ఓకే.. రెండో సినిమా సంగతేంటి?

వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఆ సినిమా రిలీజ్
అవ్వకముందే క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమా పూర్తిచేశాడు వైష్ణవ్. రీసెంట్ గా మూడో సినిమా కూడా
స్టార్ట్ చేశాడు. ఓవైపు ఇంత బజ్ నడుస్తుంటే, మరోవైపు వైష్ణవ్ తేజ్ రెండో సినిమాపై ఎలాంటి అప్ డేట్స్
లేవు.

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎవరైనా, ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తారు. డైరక్టర్ క్రిష్ కు
అలాంటి అరుదైన అవకాశమే వచ్చింది. కానీ ఎందుకో క్రిష్ మాత్రం వైష్ణవ్ తేజ్ సినిమాను
పక్కనపెట్టేశాడు. ప్రచారం చేయలేదు సరికదా, కనీసం టైటిల్ కూడా ప్రకటించకుండా వదిలేశాడు.

నిజానికి వైష్ణవ్ తేజ్ తో చేసిన సినిమాపై చాలా ప్లాన్డ్ గా ఉన్నాడు క్రిష్. కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు
ఆ సినిమాను థియేటర్లలోకి తీసుకురావొచ్చు. కానీ వైష్ణవ్ తేజ్ సినిమాకు ఇప్పుడు గ్యాప్ లేదు. కాస్త భారీగా
రిలీజ్ చేద్దామంటే వారానికో పెద్ద సినిమా ఉంది. దీనికితోడు కరోనా సెకెండ్ వేవ్ మొదలైంది. అందుకే
పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత వైష్ణవ్ మూవీని బయటకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు క్రిష్.